శ్రీ ధారపైడమ్మ తల్లి మీద రాజకీయం చేయుద్దు: తుమ్మి అప్పలరాజు దొర

విజయనగరం జిల్లా, ఎస్.కోట నియోజవర్గం, కొత్తవలస మండలం, అప్పన్నదొరపాలెం గ్రామం పంచాయతీ. శ్రీ దారపైడమ్మ తల్లి గుడిపై సంవత్సర కాలంగా రాజకీయ శక్తులు గుడిని కైవసం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని, గ్రామ ప్రజలు అందరూ గుడిని కాపాడుకోవాలని అందరూ చూస్తుంటే కొంతమంది వ్యక్తులు పెత్తనం సాగలేనప్పటకి, గుడి పై, గ్రామ ప్రజలపై కక్ష కట్టి గుడిని ఎండోమెంట్ లో కలపామని లెటర్ రాసి ఇచ్చారని, ఆ లెటర్ పరిదిలో తీసుకొని ఎండోమెంట్ వారు 2022 డిసెంబర్ 12న నోటీసు పంపించారు. ఆ నోటీసు అందుకొని ఆ గ్రామస్థులు అందరూ భయపడి తరతరాలగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొల్పోతామని బావించి, ఇచ్చిన నోటీసుకు సోమవారం దేవాదాయ ఇన్స్పెక్టర్ కు గ్రామస్థులు అందరూ కలిసి సంతకాలు చేసి ఎండోమెంట్ లో చేర్చరాదని వ్యతిరేకిస్తూ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామ ప్రజల ఉగ్గిన రాంబాబు ఎంపీటీసీ, ఉగ్గిన పాపులమ్మా, ఉగ్గిన పైడితల్లి, ఉగ్గిన నర్సింగావు, ఉర్లి పోతురాజు, ఉగ్గినా సాంబాబు, ఎస్ దేముడు తదరితులు పాల్గొన్నారు.