ములగలంపల్లి గ్రామంలో ఇంటింటికి జనసేన

పోలవరం, జీలుగుమిల్లి మండలం, ములగలంపల్లి గ్రామంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, గ్రామ పెద్ద తొమ్మిదేళ్ల వెంకటరత్నం అధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది జనసేనలో చేరడం జరిగింది. పోలవరం జనసేన ఇంచార్జి చిర్రి బాలరాజు ఇంటింటికి తిరుగుతూ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు. గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని త్రాగునీరు లేవని, సీసీ రోడ్స్ లేవని, చాలామందికి ఫించను రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఇన్ని సమస్యేలే ఉన్నా కనీసం అధికారులకు గాని, నాయకులకు గాని పట్టడం లేదా అన్నారు. తాము జడ్పీటీసీ చేసిన కాలంలో ఉన్నా అభివృద్ధి తప్ప 10 సంవత్సరాలలో అభివృద్ధి ఏమి లేదన్నారు. కచ్చితంగా చిర్రి బాలరాజుని ఎమ్మెల్యే గెలిపించి అందరికి అన్ని సదుపాయాలు వచ్చేలా చూస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుదామని, జనసేన అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు.