Friendship Day special: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘దోస్తీ’ సాంగ్‌ విడుద‌ల‌..

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి తొలిపాట విడుద‌లైంది. ఆ సినిమా అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా దీన్ని విడుద‌ల చేశారు. కీర‌వాణి అందించిన మ్యూజిక్ అదుర్స్ అనిపిస్తోంది. దోస్తీ అంటూ సాగుతోన్న ఈ పాట‌ను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. ఈ సినిమాలో హేమ‌చంద్ర ఈ పాట‌ పాడారు. ఈ పాట కోసం విడుద‌ల చేసిన ప్ర‌త్యేక వీడియోలో చివ‌రిగా ఈ సంగీత బృందంతో  ఎన్టీఆర్,  రామ్ చరణ్ క‌న‌ప‌డ్డారు.

ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌ని ఇటీవ‌లే సినిమా యూనిట్ వివ‌రించింది.

ఈ పాట కోసం విడుద‌ల చేసిన ప్ర‌త్యేక వీడియోలో చివ‌రిగా ఈ సంగీత బృందంతో  ఎన్టీఆర్,   రామ్ చరణ్ క‌న‌ప‌డ్డారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్‌గా న‌టిస్తోన్న‌ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తోన్న‌ రామ్ చరణ్ మ‌ధ్య దోస్తీ పాట ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో వీరిద్ద‌రూ స్నేహితులుగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ పాట‌ను విడుద‌ల చేశారు.

బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు.  ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.