జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

గ్రేటర్ ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ జర్నలిస్ట్ లను కూడా మోసం చేసాడని.. మేము గెలిస్తే.. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లు కచ్చితంగా ఇచ్చే బాధ్యత నాదని ఆయన అన్నారు. ప్రగతి భవన్ ఎవరికోసం కట్టారు… ఎందుకోసం కట్టారు… ఎవడి సొమ్ముతో కట్టాడు అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. 2BHK అంటే.. అందరూ ఇల్లు అనుకుని ఓట్లు వేశారని కానీ 2B అంటే బాబ్ బేటా.. H అంటే హరీష్ రావు.. K అంటే కవిత అని అన్నారు. ఆయనకు వాస్తు అనుకూలంగా లేదని.. సచివాలయం కూల్చేశాడని సంజయ్ అన్నారు. 750 కోట్లు పెట్టి కొత్త సచివాలయం కడతా అంటున్నాడు, అసలు సచివాలయమే పోనీ వ్యక్తి కట్టడం ఎందుకు అని సంజయ్ ప్రశ్నించారు.