ఆరణి శ్రీనివాసులు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న డా. పసుపులేటి

జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి నియోజకవర్గం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ బలపరుస్తున్న అభ్యర్థి ఆరని శ్రీనివాసులు, తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తూ, మంగళవారం ఉదయం తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా, భారీ ర్యాలీగా తిరుపతి తారకరామా స్టేడియం దగ్గర నుంచి బాలాజీ కాలనీ వెస్ట్ చర్చి, ఎం ఆర్ పల్లి మీదుగా ఆర్.డి.ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా కదలి జనసంద్రం. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో పాల్గొన్నారు. వేలాది మంది తిరుపతి ప్రజలు పాల్గొని ఆరాణి శ్రీనివాసులు గారిని ఆశీర్వదించటం జరిగింది.