బంధబయలు గ్రామస్తులతో సమావేశమైన డా. వంపూరు గంగులయ్య

పాడేరు: చింతపల్లి మండలం లింగలగుడి, బంధబయలు గ్రామస్తులతో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు చింతపల్లి మండల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్థానిక గ్రామస్తులు పీ.వీ.టి.జి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వారు వారి గ్రామ పరిస్థితులపై మాట్లాడుతూ.. మా గ్రామంలో మంచినీటి, సాగునీటి వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం బాధగా ఉందని, అలాగే పీ.వీ.టి.జి రైతులకు కల్పించేటటువంటి ప్రోత్సాహక రుణాలు గాని రానటువంటి పరిస్థితులను చెప్తూ వాపోయారు. గ్రామస్తులనుద్దేశించి గంగులయ్య మాట్లాడుతూ పీ.వీ.టి.జి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పథకాలు ఉన్నాయని అందులో భాగంగా రైతులకు గాని, విద్యార్థులకు, సామాజిక మహిళ సంఘాలకు గాని ఈ ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా మోసపుచ్చే ప్రకటనలు చేస్తూ వారి అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితం చేసిందని అన్నారు. రహదారికి అతి సమీపంలో ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధికి నోచుకోకపోవడం కచ్చితంగా ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని ఇక పై పోరాడే తత్వమున్న నాయకులను ఎన్నుకోవడంలో ఎటువంటి కుల ప్రాతిపదిక చూడవద్దని, కుల రాజకీయాలతో అభివృద్ధిని ఆశించలేమని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాలన తీరు మనమంతా చూస్తూనే ఉన్నామని, ప్రతి అంశాల్లోను గిరిజన ప్రజలకు ద్రోహం చేసే ఆలోచనలు చేస్తుందని కానీ ఎటువంటి సిగ్గు శరం లేకుండా ఎన్నికల దృష్టిని చూసి ప్రచారర్భాటాలు చేసే వారిపట్ల జాగ్రత్త పడాలని, అంతిమంగా గిరిజనుల అభ్యున్నతి కోరుకునే నాయకులను ఎన్నుకొండని అన్నారు. ఈ సమావేశంలో చింతపల్లి మండల నాయకులు వంతల బుజ్జిబాబు, రాజబాబు, శేఖర్, రాజారావు, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, అశోక్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.