బొర్రామామిడి గ్రామంలో డా. వంపూరు గంగులయ్య పర్యటన

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు: చింతపల్లి మండలం, బెన్నవరం పంచాయితీ, కొత్తవలస, బొర్రామామిడి గ్రామంలో జనసేన పార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. పర్యటనలో భాగంగా వారిని గ్రామస్తులు గౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంపూరు గంగులయ్య మాట్లాడుతూ మేము గతంలో ఆదివాసుల ప్రాంతాలల్లో పర్యటన చేసి పోడు వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తూ బ్రతుకుతున్న ఆదివాసీ ప్రజలు ఈ ప్రభుత్వం విధానం వల్ల, ఎస్టీ జాబితాలో వేరే ఉపకులాలుని చేర్చడానికి చేసే ప్రయత్నాలు కారణంగా పూర్తిగా ఆధారం కోల్పోయే ప్రమాదముందని ఆదివాసీ ప్రజలు భయాందోళనలతో ఉన్నారని, అందుకు ఆదివాసీ ప్రజలకు ప్రతి సమస్యలో పరిష్కారం చేసే విధంగా మన జనసేన పార్టీ అండగా ఉంతుందనిచెప్పారు. మన లాంటి ఆదివాసీ, బడుగు బలహీనవర్గాల ప్రజల రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్విరామంగా కృషిచేస్తున్నారని, అతని ఆదేశం మేరకు ప్రతి గిరిజన గ్రామాలలో పర్యటన చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నామన్నారు. ఓట్లు కోసం ప్రజల్లోకి వెళ్లి వాగ్దానాలు చేసి తీరా గెలిచాక ఓట్లు వేసిన ప్రజలను మరిచిపోతున్నారని, ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులకు ప్రజాపాలనపై శిత్తశుద్దిలేదని జనసేన పార్టీ గొప్ప ఆశయంతో యువత, ప్రజా ఆకాంక్షల మేరకు పాటుపడుతుందని మా పార్టీలోకి వచ్చే వారందరు యువత అధికంగా అలాగే అభ్యుదయబావాలున్న పెద్దలు చేరుతున్నారని అన్నారు. మేము జనసేన పార్టీ నాయకులుగా నీతి నిజాయితితో ఆదివాసీ ప్రజలకు వంతుగా మంచి చేస్తామని కానీ, ప్రస్తుత ప్రభుత్వంలా వ్యవస్థలని నాశనం చేసే చర్యలకు పూనుకోమని అన్నారు. అలాగే వైసీపీ గిరిజన ప్రజాప్రతినిధులు ఆదివాసీ ప్రజలను చాలా వరకు మోసం చేశారు. మన రాష్ట్రానికి ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కూడా మనఆదివాసీ ప్రజల అభివృద్ధికి మాత్రం మీనమేషాలు లెక్కబెడుతున్నారని విమర్శించారు. ఈ వైసీపీ ప్రభుత్వం చాలా వరకు మన రాష్ట్రానికి నాశనం చేసారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా ప్రజకంటకంగా నీచంగా ఉందని ఎందుకంటే ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలి గానీ చెడు చేసే నాయకుడు రాకూడదు అది కేవలం ప్రజా చైతన్య లోపమేనని అన్నారు అలాగే బోయావాల్మీకి, బెంతోరియా వంటి ఉన్నత కులాలను ఎస్టీ జాబితాల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఈ ఉన్నత బిసి కులాలైన బోయా వాల్మీకీలను ఎస్టీ జాబితాల్లో చేరిస్తే ఆదివాసి ప్రజలకు ఎటువంటి రిజర్వేషన్లు కూడా ఉండదని, మన గిరిజన జాతికి అన్యాయం జరిగే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఓటుబ్యాంక్ రాజకీయ కుట్ర చేస్తుందని ఈ విషయము పై మనం వ్యతిరేకించాలి మన గిరిజనులందరు మన హక్కులు కోసం పోరాటం చెయ్యాలి మన గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు కానీ గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే వారి ఆలోచన విధానం ఆనందించే విధంగా ఉందని కనీసం మాట మాత్రంగా ఆపే ప్రయత్నం చెయ్యటం లేదు ఎందుకో? వారికైనా కనీస ఆలోచన ఉందా అనేది సందేహంగా ఉందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అసలు గిరిజన బిడ్డలనేనా? ఇకపై మనం మార్పు కోసం పోరాటం చేద్దాం. మనకు ప్రశ్నంచే తత్త్వం వుండాలి. అప్పుడు మనం గెల్పించిన నాయకులను ప్రశ్నించగలం. ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం కోసం మన జనసేన పార్టీ పోరాడుతుంది. అలాగే మన మారుమూల గ్రామాలలో కనీసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా వీధి సీసి రోడ్లు, త్రాగు నీటి సదుపాయాలు కల్పించేందుకు గెలిచిన ప్రభుత్వాలలో ఎమ్మెల్యేలు కూడా ఆలోచన విధానం చెయ్యలేదు. ఎన్నాళ్లు ఇలాంటి తప్పుడు రాజకీయాలను చూస్తూ ఊరుకుంధాం ముందు మనం మారాలి?. అప్పుడు మనం గెల్పించిన నాయకులను అడగగలం. మనం ఓటేసి గెల్పించిన నాయకుల పరిపాలన సక్రమంగా లేకపోవడం వల్ల మన గిరిజన గ్రామాలు అభివృద్ధి జరగటం లేదు. కనీస సదపాయాలు చూపలేని ప్రభుత్వాలను మనం బలంగా వ్యతిరేకించాలి ఇంతకు ముందు చంద్రబాబకి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాము. ఇలా వీరి పాలనను మనం చూసేశాం చూస్తున్నాము అందుకు మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇద్దాం జనసేన పార్టీని గెలిపించుకుందాం ఆదివాసీల అభివృద్ధి కోరుకుందాం. ఇప్పటి వరకూ జగన్ రెడ్డి పాలన చూస్తే చాలా గందరగోళంగా ఉందని పండుముసలి నుంచి పసిపిల్లలు కూడా చెప్పగలరని ఎందుకంటే ఆదివాసులపై వ్యతిరేకంగా ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని దీనిని పరిపాలన అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం మనకున్న హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సమస్యలను ప్రజలనెత్తి మీద వేస్తున్నారు వైసీపీ నాయకులు ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో 32 గ్రామాల ప్రజలను తరిమేయ్యేలని ఆవిధంగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి అదాని గ్రూప్, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారని పూర్తిగా నిర్వాసితులయ్యే ఆ 32 గ్రామాల ప్రజలు ఎక్కడ వెళ్లి నివాసం ఏర్పరుచుకోవాలి?, వారి భవితవ్యం విషయమేమిటి గడిచిన 75 ఏళ్ల అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఇప్పుడు కూడా రవాణా లేని సదుపాయాలు డోలి మోతలోనే గర్భిణీ స్త్రీలను, రోగులను, చికిత్స కోసం ఆస్పత్రులలో తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ఆధివాసి రైతులను ఆర్థికంగా వెనకబడే విధంగా నెట్టే ప్రయత్నం చేస్తుందని అంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఇటువంటి తలతోకా లేని పనులు చేస్తుందని కాబట్టి గిరిజన ఆదివాసులపైన కుట్ర పూరితమైనా రాజకీయం చేస్తున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా మన హక్కులను కాలరాస్తున్నారు అందుకు మనకు ప్రశ్నించే తత్వం ఉండాలని ప్రజలకు తెలియజేశారు. మన జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య మంత్రిగా గెలిపించాలి. అది మన బాధ్యతగా భావించాలి. ప్రతి ఆదివాసీ బాధ్యతగా మంచి నాయకుడైన పవన్ కళ్యాణ్ గెల్పించుకుంటేనే మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అపరిష్కృత సమస్యలు తీరుతుందన్నారు. సమస్యలు పరిష్కారం కావలంటే మనం సామాజికంగా ప్రజల కష్టాలను తెలుసుకొన్న వారు మాత్రమే మన సమస్యకు పరిష్కారం చేపడతారు. కుల, మత, వర్గ బేధాలు లేకుండా మన జనసేన పార్టీలోకి చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరూ మన సమస్యల కోసం కలిసి పోరాటం చేద్దామని చాలా బలంగా గ్రామప్రజలోకి వెళ్లి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదని తెలియజేసారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి కొత్తవలస గ్రామస్తులు ఆనందరావు, ధనుంజయరావు వారి తదితర అనుచరులు బొర్రామామిడి గ్రామస్తులు డా. గంగులయ్య చేతుల మీదుగా కండువాలు కప్పుకుని జనసేన పార్టీలో చేరారు ఈ చేరికలకు ప్రధాన కృషి చేసిన కిల్లో రాజన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ గ్రామ పర్యటనలో అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్యగారితో పాటుగా జనసేనపార్టీ లీగల్ సెల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్, చింతపల్లి నాయకులు వంతల బుజ్జిబాబు, జి.మాడుగుల నాయకులు భీమన్న మసాడి, భాస్కరరావు, జనసేన పార్టీ ఐటి ఇన్చార్జ్ సాలేబు అశోక్ తదితర జనసైనికులు గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.