నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

నిడదవోలు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.అర్.అంబేద్కర్ గారి 131 వ జయంతి వేడుకలు గురువారం నిడదవోలు మండలం కాటకొటేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నాయకుల అలానే గ్రామ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ అంబేడ్కర్ యూత్ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలావీరస్వామి మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ కస్తూరి సుబ్బారావు, గ్రామ పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ కొప్పిసెట్టి మంగరాజు, ఉప్పులూరి వాసు, ఉల్లి రమేష్, స్వామి, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.