కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను తిరుపతి ప్రజలకు తెలియచేసిన డా. పసుపులేటి

జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో గురించి తిరుపతి ప్రజలకు మీడియా సమావేశంలో తెలియచేసిన జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ నాయకులు. కూటమి మేనిఫెస్టో హామీలు
1.మెగా డీఎస్సీపై తొలి సంతకం, 2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000, 3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000, 4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500, 5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం,6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 7.రూ.3000 నిరుద్యోగ భృతి, 8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000, 9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ,
10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి, 11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000, 12.ఉచిత ఇసుక, 13.అన్నా క్యాంటీన్లు, 14.భూ హక్కు చట్టం రద్దు, 15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, 16.బీసీ రక్షణ చట్టం, 17.పూర్ టూ రిచ్ పథకం, 18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 19.కరెంటు చార్జీలు పెంచం, 20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, 21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం, 22. పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, 23.పెళ్లి కానుక రూ.1,00,000/-, 24.విదేశీ విద్య పథకం, 25.పండుగ కానుకలు, మేనిఫెస్టోను తిరుపతి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజేష్ యాదవ్, కార్యదర్శి ఆనంద్, యువనాయకుడు చందు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.