నవ వధువుకు బాసటగా డాక్టర్ కందుల

విశాఖ, జీవీఎంసీ స్థానిక 34వ వార్డు జండా చెట్టు ప్రాంతానికి చెందిన నవ వధువు సుశీలకు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు బాసటగా నిలిచారు. సోమవారం ఆమె కుటుంబాన్ని కలిసి ఇతోధికంగా సహాయం చేశారు. పెళ్లి కుమార్తె సుశీలకు బంగారు తాళిబొట్టు, పట్టు చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి తన పరిధి మేరకు నిర్విరామంగా సహాయం చేస్తున్నారని చెప్పారు. ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే నవవధువు సుశీలకు తాళిబొట్టు, పట్టుచీర అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అప్పలనరసమ్మ, విజయ్, జనసేన నాయకులు ప్రసాద్, హరీష్, లక్ష్మి, లావణ్య, సన్యాసమ్మ, పార్వతి, ఎల్లియమ్మ, పద్మ, గణేష్, సతీష్ అశోక్ ఆనంద్, ధనరాజు, శంకర్, రాము, కృష్ణ, రాజు, బి. రాజు, శ్రీను, నాగేంద్ర, జానకి, రాజేశ్వరి, జాన్సీదుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గున్నారు.