పూల అనాకరావు భీమా చెక్కు అందజేసిన గాదె

పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపాడు మండలం ఓర్వకల్లు గ్రామంలో జనసైనికుడు పూల అనాకరావు యాక్సిడెంట్ కి గురవడం జరిగింది. పూల అనాకరావు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కాబట్టి అతని మెడికల్ ఖర్చుల నిమిత్తం 32,000/- లు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెక్కుని జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావుకి పంపించడం జరిగింది. సోమవారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో చెక్కుని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్రం ప్రసాద్, యర్రంశెట్టి రామకృష్ణ, శిఖా బాలు,మండల అద్యక్షులు మట్టం భద్ర, అఖిల్, అద్దెపల్లి రమేష్, రాయి సత్యనారాయణ, లేళ్ళ నాగేశ్వరరావు తదితరులు.