వీరమహిళలు చందన, దుర్గల తండ్రికి నివాళులర్పించిన డా.పసుపులేటి హరిప్రసాద్

తిరుపతిలోని వీర మహిళలు చందన, దుర్గల తండ్రి అకస్మాత్తుగా స్వర్గస్తులవడం జరిగింది. వారి పార్థివ దేహానికి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబానికి మనోధైర్యం నింపి జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, చిత్తూర్ జిల్లా కార్యదర్శి కలప రవి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.