ఎన్ని కేసులు పెట్టినా జనసేనని ఆపలేరు

నెల్లూరు, గిరిజనుడికి మద్దతుగా నిలిస్తే గిరిజన నాయకులపై, జనసేన నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ నిర్వహించిన ప్రెస్ మీట్ లో గిరిజన నాయకులతో కలిసి జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ గత నెల రోజులుగా రూరల్ లో టిడ్కో స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎమ్మార్వో సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. ప్రభుత్వ స్థలాలకి వేకెడ్ ల్యాండ్ పన్నులు వేసి వైసిపి పెత్తందారులు కబ్జా చేస్తున్నారంటే వాటికి కేసులు నమోదు కావు. అవి అన్యాయాలుగా కనబడటం లేదు వైసిపి నాయకులకు. పోలీస్ సోదరులారా మీకు కూడా ఎంతో కష్టంగా ఉంది. సెలవు లేవు అలవెన్సులు లేవు.. జీతాల్లో కోతలు జగన్ పెట్టే వాతలు మీకు తెలుసు. ఏం చేస్తాం మీకు కూడా ఒత్తిడి ఉన్నట్టుంది. గిరిజనుడికి జరిగిన అన్యానికి మద్దతుగా నిలిస్తే కేసులు పెట్టారు బుకాయింపుగా మరో గిరిజనుడికి ఉద్యోగం ఇచ్చాం అంటున్నారు. 9 సంవత్సరాల కష్టపడ్డ కష్టపడి ఉన్న ఫలానా ఉద్యోగం నుంచి తీసేస్తే ఆ బాధ ఎట్లా ఉంటుందో మీరు కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇన్ని కేసులు ప్రతిపక్షాల మీద పెట్టిన పార్టీ ఒకే ఒక్క పార్టీ వైసిపి పార్టీగా నిలిచిపోతుంది. మన హక్కుల కోసం పోరాడుతుంటే అణిచివేస్తున్న ఈ వైసిపి నాయకుల్ని తరిమికొట్టాలి. మూడు గంటలు ఎంతో సమన్వయంతో నిరసన వ్యక్తపరిస్తే మా మీద కేసులు పెట్టడం సబబు కాదు. గిరిజన సోదర సంఘాలు చెప్పినట్లు దీనిని ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం గిరిజన సోదరీమణులకు జరిగిన అవమానాన్ని వారి దృష్టికి తీసుకువచ్చి న్యాయం కోసం పోరాడుతాం. గిరిజన సోదరునికి ఉద్యోగం వచ్చేవరకు కూడా ఈ పోరాటాలు ఆపేది లేదని మరొకసారి విన్నవిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, బొబ్బేపల్లి సురేష్, గిరిజన నాయకులు పెంచలయ్య, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.