ఉక్కు మనిషికి డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ ఘన నివాళులు

పిఠాపురం: ఉక్కు మనిషి, మాజీ ఉప ప్రధాని దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్. దేశాన్ని ఏకం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది. సర్దార్ వల్ల బాయ్ పటేల్ దేశ స్వాతంత్య్రం కోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేసి ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిపోయారు.‎ దేశం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న దేశాన్ని తన సమర్థతతో, శక్తియుక్తులతో ఏకం చేసి అఖండ భారత నిర్మాణం చేసిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కే దక్కుతుంది. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమ స్పూర్తితో ఉక్కు మనిషిగా నిలిచారు. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న దేశాన్ని సమర్థతతో, శక్తియుక్తులతో ఏకం చేసి అఖండ భారత నిర్మాణం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే సాధ్యమైనది. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించిన డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసిన సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో వచ్చిన అతి పెద్ద సవాల్ భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయే పరిస్థితి వస్తే అలాంటి పరిస్థితుల్లో ఈ బాధ్యతలను సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నారు 500 సంస్థానాలుగా ఉన్న ఈ భారతదేశం సమైక్య భారతదేశంలో విలీనం చేయడానికి ఆయన చేసిన శ్రమ వర్ణించలేనిది, అదేవిధంగా చాలావరకు అన్నింటిని విలీనం చేశారు కానీ మూడు సంస్థానాలను మాత్రం విలీనం చేయడానికి వ్యతిరేకించాయి అందులో ఒకటి కాశ్మీర్, జొన్న గడ్డ, అదేవిధంగా అప్పటి సమైఖ్యాంధ్రలో నిజాం సంస్థానం వేరేగా ఉండేది ఈ నిజాం సంస్థానానికి అధిపతులుగా ఉన్న నిజాం నవాబులు భారతదేశంలో విలీనానికి వ్యతిరేకించారు. అటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా పాకిస్తాన్లో కలవడానికి శ్రద్ధ చూపించారు. భారతదేశంలో హాట్ లాంటి హైదరాబాద్, అంటే నిజాం సంస్థానం పాకిస్థాన్లో కలిస్తే చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంటుందని గ్రహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వెంటనే సైనికుల ధళాన్ని అంతటిని తీసుకుని వచ్చి బై ఫోర్సు భారతదేశంలో విలీనం చేశారు. లేని పక్షాన ఈరోజు అనేక ఇబ్బందులు భారతదేశంలో కలిగి ఉండేవి. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నిరంకుశ పాలన నుంచి భారతదేశాన్ని ఎలా కాపాడారో.. అదేవిధంగా ఈరోజు మన నవయువ సర్దార్ వల్లభాయ్ పటేల్లాంటి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడైతే నిరంకుశ పరిపాలన ఉందో అట్లాంటి వైయస్సార్సీపి పరిపాలన నుంచి కూడా రాబోయే ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు కాపాడతారని, రాబోయేవి మంచి రోజులని, జనసేన రోజులని జనం కోసం జనం స్వతంత్రంగా బయటకు వచ్చి తిరిగే రోజులు వస్తాయని డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ తెలియజేసారు.