శరన్నవరాత్రులలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం స్థానిక పాత బస్టాండ్ నందు ఆటో యూనియన్ సోదరులు దేవి శరన్నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి దుర్గాదేవి మండపానికి జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా అమ్మవారిని దర్శించుకుని, ఆ దయగల తల్లి ప్రజలు బాగుండాలని ఆకాంక్షించే ఆ జననాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్, ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేనపార్టీ ఎప్పుడూ బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ 5116/- రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆటో యూనియన్ సోదరులు సంతోషాన్ని వ్యక్తం చేసి అనంతరం ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.