నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డాక్టర్ పిల్లా శ్రీధర్ డిమాండ్

పిఠాపురం నియోజకవర్గం, కందరాడ గ్రామంలో అకాల వర్షాల కారణంగా నీట మునిగిన పంటను మరియు కళ్ళల్లో తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అనంతరం రైతులతో మాట్లాడి పంట నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందే విధంగా జనసేన పార్టీ వైపు నుంచి ప్రభుత్వానికి తెలియపరచడమే కాకుండా రైతుకి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా చేతికి అందిన పంట అకాల వర్షాల కారణంగా పంట నష్టపోవడం వల్ల రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం అందకపోతే రైతులు కుటుంబంతో సహా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం దయ ఉంచి పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50,000/- రూపాయలు చొప్పున పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ వాపోయారు, లేనిపక్షంలో రైతులతో కలిసి వ్యవసాయ శాఖ కార్యాలయానికి రిప్రజెంటేషన్ అందించి అవసరమైతే కలెక్టర్ కి కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కలెక్టర్ కి కూడా వినతిపత్రం అందించడం జరుగుతుందని రైతుకి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడుతామని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేసిరెడ్డి బుల్లి రాజు, కేసిరెడ్డి శ్రీను, జీను శ్రీను, కేసిరెడ్డి సూరిబాబు, నక్క శ్రీనివాస్, సారా శ్రీను, అడ్డూరి శ్రీను, పిల్లా రాజా, గుర్రం గంగాధర్, మరిశే వెంకటేశ్వరరావు, మరిశే తాతారావు, కేసిరెడ్డి దొరబాబు, సైతన బుల్లి రాజు, సైతన రాజుబాబు మరియు గ్రామ రైతులతో పాటు జనసైనికులు పాల్గొనడం జరిగింది.