నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే మరణం లేని ఏకైక వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని డాక్టర్ శ్రీధర్ అన్నారు. అదేవిధంగా స్వాంతంత్య్ర స‌మ‌ర సేనాని “సుభాష్ చంద్రబోస్” మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలంటే కేవలం అహింస మార్గం ఒక్కటే కాదని, ఆంగ్లేయుల పాలన నుండి మనకు విముక్తి కావాలంటే మనం కూడా సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నమ్మిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత పౌరుడిగా, మన ఉజ్వలమైన మరియు స్వతంత్ర భవిష్యత్తు కోసం సుభాష్ చంద్రబోస్ అందించిన సహకారాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేము.” ప్రస్తుత కాలంలో, మనం ఎప్పుడూ కలలు కనే దేశాన్ని సృష్టించడానికి అదే దేశభక్తి మరియు ధైర్యాన్ని నింపగల సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుడు అవినీతి సమర జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ మనకు కావాలి. ఈ వైసీపీ అరాచక పాలన పోవాలి స్వేచ్ఛా భారతదేశం, ఆజాద్ హింద్ ఆలోచనకు, తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి నేతీజీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నేతాజీదే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అని శ్రీధర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధు, వాకపల్లి సూర్యప్రకాష్, మోటూరి మహేశ్వరరావు, సారా శేఖర్, బారుకుల కృష్ణ, పిల్లా నాగార్జున, మిరియాల చిట్టిబాబు, నంద్యాల ముసలయ్య, పిల్ల లావరాజు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.