కలిసికట్టుగా పని చేద్దాం- కూటమి జెండా ఎగరేద్దాం

తాడేపల్లిగూడెం: బూత్ ఏజెంట్ల సమావేశంలో టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు రాబోయే నెల రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి కూటమి జెండా ఎగరవేద్దామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని గొర్రెల సూరన్న కాంప్లెక్స్ లో శనివారం పట్టణంలోని 13 నుంచి 25 వార్డుల బూత్ ఇన్చార్జిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ చిన్న పెద్ద బేసజాలు బేధాలు లేకుండా పార్టీల తారతమ్యం లేకుండా అంతా బాధ్యత వహించి పార్టీ గెలుపుకే పనిచేయాలని కోరారు. అవినీతి వైసీపీ పార్టీ నుంచి ఎన్నో ప్రలోభాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను మనం తిప్పి కొట్టాలని కోరారు. పూర్తి ఇన్చార్జిలకు అందరికీ స్వేచ్ఛనిస్తున్నామని కింద స్థాయి కేడర్ను అందర్నీ కలుపుకొని వెళ్లి పార్టీ విజయానికి బాటలు వెయ్యాలని కోరారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని. ఒకరిపై ఒకరికి ఎలాంటి భేద భావాలు పెట్టుకోకుండా నెల రోజులు ఒక యుద్ధంలో పనిచేయాలని దానికి తాను సైన్యాధ్యక్షుడిగా ఉంటానని పేర్కొన్నారు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రాష్ట్రంలో జగన్ బొమ్మ వేసి వారు ప్రచారం చేసుకుంటున్నారని వాటిని ప్రజలకు అర్థమయ్యే విధంగా కార్యకర్తలు నాయకులు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు బూత్ ఇన్చార్జిలు హాజరయ్యారు.