కొనాల లోవరాజును పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఎస్ సి జెడ్ నందు ఇటీవల బైక్ యాక్సిడెంట్ కారణంగా గాయాలు కావడం వల్ల హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతూ, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కొనాల లోవరాజును పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని, తనకు జరిగిన ట్రీట్మెంట్ ను ఎక్స్రే రిపోర్ట్ ను పరిశీలించారు. లోవరాజు తగిన ఆరోగ్యపరమైన సలహాలను, సూచనలను అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ ప్రెసిడెంట్ కోనాల సూరిబాబు, నిమ్మ సుబ్బారావు, మలక సూర్యచంద్ర, మలక శ్రీనివాసరావు, కోణాల బద్రి, రాజాల శ్రీను, చింతాడ నాగేశ్వరరావు, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యానంద రావు, కోన రామకృష్ణ, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.