మసా చిన్నపుత్రయ్యని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, కందరాడ, డాక్టర్ పిల్లా శ్రీధర్ సొంత గ్రామం నందు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మాసా చిన్నపుత్రయ్యని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తగిన సలహాలు సూచనలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ బొంతు లచ్చరావు, ఎక్స్ ఎంపిటిసి కుసుమ సుబ్బారావు, మసా పెద్ద పుత్రయ్య, మసా లక్ష్మణస్వామి, కాపవరపు బుల్లపరావు, మసా సూరిబాబు, మల్లవరపు వీరబాబు, కన్నబాత్తుల బాబులు, రాజల కృష్ణ, బుర్ర అర్జునరావు, అల్లపల్లి భవాని, అల్లపల్లి లక్ష్మి, 11వ వార్డు నెంబర్ కన్నబాత్తుల సుగుణ కుమారి, అల్లంపల్లి కుమారి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.