మత్స్యకార సమస్యలపై కలెక్టర్ కు డాక్టర్ పిల్లా శ్రీధర్ వినతిపత్రం

  • కాకినాడ కలెక్టర్ ఆఫీస్ స్పందనలో మత్స్యకార సమస్యలపై కలెక్టర్ కు వినతిపత్రం అందించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వేట నిషేధ భృతి తక్కువ కావడం వల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయిల్ సబ్సిడీ 300 లీటర్ల చాలా తక్కువ అని దీని వల్ల పడుతున్న ఇబ్బందుల రీత్యా మరియు రక్షణ వాలు నిర్మించి, మత్స్యకార గ్రామాలను కాపాడాలని జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మత్స్యకార నాయకులతో కలిసి వారి సమస్యలపై కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులు వేట నిషేధం కారణంగా రెండు నెలలు సంపాదనలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వారు ఇచ్చే వేట నిషేధ భృతి ఒక కుటుంబానికి రెండు నెలలకి కలిపి 10,000/- రూపాయలు ఇస్తున్నారు అంటే రోజుకి 160/- రూపాయలు ఒక మత్స్యకార సోదరుడు వేటకి వెళ్తే అతని కుటుంబంలో నలుగురైదుగురు తన మీదనే ఆధారపడి ఉంటారు. ఇప్పుడు మనం చూస్తుంటే నిత్యావసర వస్తువులు ఆకాశానికి అందుకుంటున్న ఈ పరిస్థితుల్లో 10,000/- రూపాయలు ఏ మాత్రం సరిపోవని, చాలా తక్కువ కాబట్టి 10,000/- నుండి 30,000/- కి పెంచాలని, అదేవిధంగా ఆయిల్ సబ్సిడీ 300 లీటర్లు ఇస్తున్నారు. ఇది రెండు మూడు సార్లు వేటకి వెళ్లి వచ్చేసరికి అయిపోతుంది. మళ్లీ మత్స్యకార సోదరుడు తన జేబులోంచి తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పక్కన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటే 3000 లీటర్ల వరకు ఇస్తున్నారని, అదేవిధంగా ఈ ఉప్పాడ మూలపేట, కోనపాప పేట గ్రామాల్లో కూడా 300 నుంచి 3000 లీటర్ల వరకు ఇవ్వాలని, అదేవిధంగా ఉప్పాడ సముద్ర తీరం తరచూ కోతకు గురవడం జరుగుతుంది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఇళ్ళు కొట్టుకుని పోయే పరిస్థితిలో ఉందని, తక్షణమే రక్షణ గోడ నిర్మించాలని లేకుంటే కొద్దిరోజులకి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పాడ కోనపాప పేట, మూలపేట మొదలగు గ్రామాలు కొట్టుకొని పోయే పరిస్థితి ఉందని, ఫ్యూచర్లో మనం ఈ గ్రామాల గురించి మాట్లాడుకోవడం తప్ప, చూడడానికి కూడా కనిపించే అవకాశం ఉండదని, తక్షణమే చర్య తీసుకుని రక్షణ గోడ నిర్మించాలని, జిల్లా కలెక్టర్ కు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొర, మత్స్యకార నాయకులు వంక కొండబాబు, మత్స్కర నాయకులు రాంశెట్టి రాంబాబు, కొత్తపల్లి రాజు, బొంతల వెంకటరావు, సోదే రవి కిరణ్ ( బాబీ) పుక్కల కుమార్, పల్నాటి మధుబాబు, పి అప్పారావు, ఎస్ గణేష్ మత్స్యకార సోదరులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.