వృద్ధులకు అండగా డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం నందు ఏ ఆధారం లేనటువంటి వృద్ధులకు ఉప్పాడ జనసైనికులు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ని కలిసి వారి యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ శ్రీధర్ పిల్లా మరెడ్డి గాంధీ మరెడ్డి భూలక్ష్మి అను వృద్ధ దంపతులను పరామర్శించి వారి కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకుల లావరాజు, ఎస్ సురేష్, కే నాగరాజు, వి మణి, పి నూకరాజు, కే దుర్గారావు, పలివెల నాని, వెన్నుపోతుల వీరబాబు, కె రవి, కొత్తపల్లి రాజు, గేదెల వెంకటరావు, సోమి రవికిరణ్, మైలపల్లి రాజు, మరియు అధిక మొత్తంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.