దళిత కుటుంబానికి జనసేన నాయకుల ఆర్థిక సహాయం

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, వంగిపురం ఎస్సీ నాయకుడు విజయ్ మేనల్లుడు కొప్పురావూరు గ్రామ దళిత బిడ్డ 8′ సంవత్సరాల వయస్సు గల పాలెపోగు సుధీర్ అనారోగ్యం పాలై లివర్ మార్చవలసి వచ్చింది, లివర్ మార్చాలంటే భారీగా ఖర్చు అవుతుందని ధాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయాలని డేగల లక్ష్మణ్ ని కోరగా.. వారి వంతు సహాయం నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయగలమని ఈ సహాయాన్ని జనసేన నాయకుడు వీరిశెట్టి సుబ్బారావు చేతులమీదగా అందించడం జరిగినది.

ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ దళిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా జనసేన పార్టీ ఉంటుంది అని తెలియచేశారు.

మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు కంకణాల శంకర్ మాట్లాడుతూ వీలు ఉన్నంతవరకు జనసేన పార్టీ అధినాయకత్వానికి ఈ సుధీర్ పడుతున్న భాదను తెలియచేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సీనియర్ నాయకులు గుగ్గిళ్ళ సురేష్, తిరుమల సాంబశివరావు, కొప్పురావూరు జనసేన నాయకులు శేషయ్య, విన్నకోట సుబ్బు తదితర జనసైనికులు పాల్గొన్నారు.