అగ్ని ప్రమాద బాధితులకు మనోధైర్యాన్నిచ్చిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మున్సిపాలిటీ నందు బండి దొంగ అబ్బాయి, బండి బుచ్చిరాజు ల రెండు ఇళ్ళు కాలి బూడిద అయిపోవడం వల్ల ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి నిత్యావసర వస్తువులు లేకుండా భారీగా ఆస్తి నష్టం కలగడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ రెండు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. అనంతరం ఆ ఒక్కో కుటుంబానికి నెలకు సరిపడగా 50 కేజీల బియ్యం మరియు కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపు నుంచి డాక్టర్ శ్రీధర్ పిల్లా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సిహెచ్ సతీష్, ఉమ్మడి నాగు, కర్రీ గంగాధర్, కే సాయి, వి శ్రీను, బాలాజీ, ఆర్ భార్గవ్, కె మణి, వి సతీష్, కే ప్రసాద్, ఎం నూకరాజు, జనసైనికులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.