రాచ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న డా. కందుల కుటుంబ సభ్యులు

వైజాగ్ సౌత్: వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని కోరుతూ 32వ వార్డులో గల రాచ పోలమాంబ అమ్మవారిని డాక్టర్ కందుల కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసీపీకి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పేది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జనసేన, టిడిపి కూటమి వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. విశాఖలో ముఖ్యంగా దక్షణనియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కావడానికి పార్టీ నాయకత్వంతో కలిసి కృషి చేయడం జరిగిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. నియోజవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తన విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. మెజార్టీ ఓట్లతో తాను విజయం సాధిస్తానని వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గం ప్రజలంతా తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, డాక్టర్ కందుల కుటుంబ సభ్యులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.