శిదిలావస్థలో ఉన్న పాఠశాలను సందర్శించిన డా.యుగంధర్ పొన్న

  • ఎర్రగుంటపల్లి ప్రాధమిక పాఠశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టాలి
  • కొత్త సమర్ధులైన మండల విద్యాశాధికారిని నియమించాలి
  • జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం పంచాయతీ ఎర్రగుంటపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్నదని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. పాఠశాలను సందర్శించి శిధిలావస్థలో ఉన్న ఈ పాఠశాలకు మహర్ధశను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని, నాడు నేడు కింద నూతన భవన నిర్మాణం మంజూరు చేసి వీలైనంత తొందరగా నిర్మాణ పనులు చేపట్టాలని తెలియజేశారు. నాడు నేడు కార్యక్రమంలో దశలవారీగా చేసేటువంటి మంజూరులో మొదటి ప్రాధాన్యత కింద ఎర్రగుంటపల్లి పాఠశాలను గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందని, గుర్తించేటప్పుడు ప్రతి పాఠశాలను ఫిజికల్ వెరిఫికేషన్ చేసి మంజూరు చేసి ఉంటే బాగుండేదని, ఎక్కడో ఏసి రూముల్లో కూర్చొని ప్రాధాన్యత క్రమంలో ఈ విధమైన పాఠశాలను గుర్తించకపోవడాన్ని తప్పు పట్టారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటికీ శిధిలావస్థలో ఉన్న పాఠశాలకు ఇప్పటికైనా న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ పాఠశాలకు తొందరగా పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కొత్తగామండల విద్యాశాఖ అధికారి నియమించాలని, వచ్చే అధికారి సమర్థత కలిగినటువంటి అధికారిగా ఉండాలని, అసమర్థులను నియమించకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కిషోర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిసతీష్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, రాఘవ గ్రామ పెద్దలు ఉన్నారు.