డబుల్ రోడ్డు వేయలేని స్వామి అసమర్ధత వర్ధిల్లాలి.. డాక్టర్ యుగంధర్ పొన్న

  • ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం 49 కిలోమీటర్లు రోడ్డు వేయలేని దుస్థితి
  • డబుల్ రోడ్డు వేయలేని ఉపముఖ్యమంత్రి స్వామి అసమర్ధత వర్ధిల్లాలి అంటూ పాదయాత్రలో నిరసన వ్యక్తం చేసిన డాక్టర్ యుగంధర్ పొన్న
  • జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండి మంచి పాలన అందిస్తాం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలం నుంచి పచ్చికాపలం వెదురుకుప్పం మీదుగా కొత్తపల్లి మిట్ట వరకు రోడ్డు విస్తరణ చేయాలని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న నాలుగవ రోజు పాదయాత్ర పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. కొత్తపల్లి మిట్ట కూడలి నుంచి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నారాయణస్వామి రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి అయ్యారు, ఒకసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అయినా గాని ఈ 49 కిలోమీటర్ల రోడ్డుని విస్తరణ చేయలేక తన అసమర్ధతను నిరూపించుకున్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో ఉత్తుత్తి వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి అందలం ఎక్కిన తర్వాత ప్రజలను విస్మరించి స్వార్థంతో, బందు ప్రీతితో నియోజకవర్గాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేసి, ఇప్పుడు తన కూతుర్ని ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని ఇలాంటి అసమర్థ ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా ఎప్పుడు ఓటు వేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కార్వేటి నగరం నుంచి పచ్చికాపలం వెదురుకుప్పం మీదుగా కొత్తపల్లి మిట్ట వరకు డబుల్ రోడ్డు వేయకపోతే, ఒక వారంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా ఘాటుగా స్పందించారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా ప్రజలు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నకు మంగళ హారతులతో, పూలమాలలు వేసి దుస్సాలువులతో సన్మానించి బ్రహ్మరథం పట్టారు. 2024లో నిన్ను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికే పరిమితం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ నియోజకవర్గంలో పని చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శిలు, జిల్లాకమిటీ నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.