DSSSB Recruitment 2021: 1809 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1809 ఖాళీలను ప్రకటించింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 మార్చి 15న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://dsssb.delhi.gov.in/ లేదా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.

DSSSB Recruitment 2021: ఖాళీల వివరాలు..

మొత్తం ఖాళీలు- 1809

టెక్నికల్ అసిస్టెంట్- 32

ల్యాబరేటరీ అటెండెంట్- 66

అసిస్టెంట్ కెమిస్ట్- 40

అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అండ్ ఎం- 14

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ లేదా మెకానికల్)- 62

డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ 1- 16

పర్సనల్ అసిస్టెంట్- 84

ఫార్మసిస్ట్- 82

అసిస్టెంట్ డైరెక్టర్- 3

అసిస్టెంట్ గ్రేడ్ 2- 28

జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 13

జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్- 31

సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ- 6

సెక్యూరిటీ సూపర్‌వైజర్- 9

అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్- 158

కార్పెంటర్ 2 క్లాస్- 4

అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్‌వైజర్- 11

ప్రోగ్రామర్- 5

టీజీటీ (చెవిటి & మూగ)- 19

స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ- 1126

DSSSB Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 15

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 14

విద్యార్హతలు- పోస్టుల వారీగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.100

ఎంపిక విధానం- ఒక దశ లేదా రెండు దశల రాతపరీక్ష, స్కిల్ టెస్ట్

DSSSB Recruitment 2021: అప్లై చేయండి ఇలా

ముందుగా https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో దరఖాస్తు లింక్ పైన క్లిక్ చేయాలి.

పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

తర్వాతి స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

చివరగా దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.