డా.బాబు జగ్జీవన్ రామ్ కు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఘననివాళి

నెల్లూరు, స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వేదాయపాలెం సెంటర్లో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాట వీరుడిగా, దేశములో అట్టడుగు వర్గాల తరపున వారి హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో పాటు కృష్ణ పెన్నా రీజినల్ కో- ఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, నగర కార్యదర్శి అక్కిశెట్టి శ్రీధర్, నగర డివిజన్ ఇన్చార్జులు కరీం, షాకీర్, భీమా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.