కృష్ణా కరకట్ట క్రింద డంపింగ్ యార్డ్ చెత్త పోయటం దుర్మార్గమైన చర్య

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నా 7 వ వార్డ్ కృష్ణా కరకట్ట క్రింద ఉన్న నది పరివాహక ప్రాంతంను డంపింగ్ యార్డ్ చెత్తతో పూడ్చటం చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కృష్ణా కరకట్ట అవనిగడ్డ గ్రామాన్ని కాపాడుతుంది. కృష్ణా కరకట్ట క్రింద పచ్చని పొలాలు మామిడి, జామ తోటలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు ఎక్కువుగా ఈ పొలాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అదే విదంగా ఈ కరకట్ట క్రింద నిరుపేద కుటుంబాలు వారు నివాసం ఉంటున్నారు. అదే విధంగా కరకట్టకు దిగువన ప్రాథమిక పాఠశాల, మసీదు, దగ్గరలోనే కోర్టు భవనాలు ఉన్నాయి. ఈ డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్త, మందు బాటిల్స్, కుళ్ళుపోయిన చెత్తతో కూడిన మట్టి పోయడం వలన కరకట్ట క్రింద ఉన్న ప్రాంతం పూడి పొతే రేపు వరదలు వచ్చినప్పుడు కరకట్ట దాటి వరద నీళ్లు ఊరు మీదకు వచ్చి ఊరు మునిగి పోయే పరిస్థితి ఉంది. అలాగే పనికిరాని చెత్తతో కూడిన మట్టి వేయటం వలన, ప్రజలు ఆరోగ్యం, పచ్చని పంటపొలాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. గతంలో కుడా డంపింగ్ యార్డ్ చెత్త వేసేటప్పుడు ప్రజలు, విద్యార్థులతో కలిసి చెత్త పోయికుండా ఆపటం జరిగింది. మంగళవారం ఉదయం నుండి దాదాపుగా 10 ట్రాక్టర్లు పెట్టి పంచాయతీ అధికారులు దగ్గర ఉంది కృష్ణా కరకట్ట క్రింద పల్లపు ప్రాంతం పూడిపించటం బాధాకరం. సదరు అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ చర్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి ఈ విషయం పరిశీలించి, న్యాయం చేయవలిసినదిగా జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. పంచాయతి అధికారులు వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ చెత్తతోకూడిన మట్టి తోలకం నిలుపుదల చేయించండి. అధికారులు పట్టించుకోక పొతే ప్రజా ఉద్యమం చేసి ఆ చెత్త తొలిగించే వరకు పోరాటం చేస్తామని జనసేన పార్టీ తరుపున అధికారులకు, ప్రజా ప్రతినిధులకు హెచ్చిరిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు తెలిపారు.