తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్న ఎడపల్లి పోలీసులు

నగరంలో తీన్మార్ మల్లన్నను నిజామాబాద్‌ జిల్లాలోని ఎడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9న జయవర్ధన్ అనే కల్లు ముస్తాదారు మల్లన్న పాదయాత్ర పేరుతో తనను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఐదుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఫిర్యాదులో A1 ఉప్పు సంతోష్ ను 10వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. A5 గా ఉన్న తీన్మార్ మల్లన్నను గురువారం హైదరాబాద్‌లో అదువులోకి తీసుకుని రాత్రి నిజామాబాద్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి తిరిగి హైదరాబాద్‌కు పంపనున్నారు.