రామచంద్ర నగర్ నందు ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని మరియు అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.