విద్యుత్ ఉద్యోగుల నిరవదిక సమ్మెతో విద్యుత్తు సరఫరా నిలిపివేత

అనంతపురం: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్తంగా నిరవేదిక సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం వలన ప్రజలు నానా ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బుడ్డప్ప నగర్, రాణి నగర్, గౌరవ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సిబ్బంది మరియు అధికారులు వారి సెల్ ఫోన్ సిమ్ములు తీసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక 100 డయల్ కు ఫోన్ చేస్తున్నప్పటికీ నిన్నటి రాత్రి 100 డయల్ కూడా పనిచేయకపోవడం ప్రజలకు తమ ఇబ్బందులు ఎవరికి తెలపాలో తెలియక అనంతపురం జిల్లా జనసేన పార్టీ వారికి రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తమ ఇబ్బందులను వెళ్లబుచ్చుకున్నారు. విషయం తెలిసిన తక్షణమే ప్రజల ఇబ్బందులు ఇక్కట్లు గమనించి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, భవాని నగర్ సాయి కిరణ్, తేజ, ప్రవీణ్ కుమార్, జనసేన నాయకులు స్థానిక కాలనీల ప్రజలతో కలిసి అనంతపురం సెంట్రల్ పవర్ ఆఫీస్ ఓల్డ్ టౌన్ దగ్గరికి వెళ్ళగా సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యుత్ నగర్ లో ఉన్న పవర్ ఆఫీస్ కు వెళ్లగా కొంతవరకు విద్యుత్ నగర్ పవర్ ఆఫీస్ వారు కొంతవరకు సమస్యను పరిష్కరించారు. విద్యుత్ ఉద్యోగులు అధికారులు తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా ప్రజలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.