విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి

  • గజపతినగరం నాయకులు జనసేన పార్టీ మర్రాపు సురేష్

గజపతినగరం: జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ కరెంటు చార్జీలు పెంచుతూ అసలే వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో విద్యుత్ చార్జీలను పెంచడం వలన వైసీపీ ప్రభుత్వం ప్రజల పైన మోయలేని పెనుబారం మోపుతున్నారని జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గజపతినగరం నాలుగు రోడ్లు జంక్షన్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటుచేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి గారు తన పాదయాత్ర సమయంలో కరెంటు చార్జీలు తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని ప్రతి ఊరు తిరిగి చెప్పిన జగన్ మాట తప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే, కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఒక రూపాయి ప్రజలకు ఇచ్చి పది రూపాయలు ప్రజల పైన పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తీరు వలన నిత్యవసరాలన్నీ పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు బ్రతుకు భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరుపున ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడడ మోహన్ రావు, డా.మిడతాన రవికుమార్, బాలు, మండల నాయకులు పండు, ఆదినారాయణ, మహేష్, శ్రీను, ప్రశాంత్, బాల కృష్ణ, శంకర్, సురేష్ రెడ్డి, జనసైనికులు పాల్గొన్నారు.