అధికార పార్టీ ఫ్లెక్సీలను తొలగించండి: దర్శి జనసేన పార్టీ డిమాండ్

దర్శి నగరంలో అధికార పార్టీ నాయకులు – జనసేన పార్టీ అధినేతను, జనసేన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ జనసేన పార్టీ దర్శి నగర పంచాయతీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, పార్టీ నాయకులు మారాబత్తుని వెంకటయ్య, ఉప్పు ఆంజనేయులు, జడల వెంకట్, యాదాల వెంకటేష్, గోగు శ్రీనివాస్, గోగు రమేష్, ప్రేమ్ కుమార్ తదితరులతో కలిసి సోమవారం గౌరవ దర్శి మండల రెవెన్యూ అధికారి మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, దర్శి మునిసిపల్ కమీషనర్, దర్శి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. జనసైనికుల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి, వచ్చే సార్వత్రికలలో రాజకీయ లబ్ది పొందాలని అధికార పార్టీ నాయకులు కుటిల యత్నాలు చేస్తున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు వచ్చే ఎన్నికలలో అధికార పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, వారికి తగిన బుద్ధి చెప్పి జనసేన పార్టీనే గెలిపిస్తారని వారు అన్నారు. రాజకీయ లబ్ది కోసం విలువలకు తిలోదకాలు ఇవ్వడం అధికార పార్టీ నాయకులకే చెల్లిందన్నారు. జనసేన పార్టీ దర్శి నియోజకవర్గంలో ఎంతో సంయమనంతో హుందాతనంగా వ్యవహరిస్తున్నదని, అంతేకాని జనసైనికుల మనోభావాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోదని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు వాస్తవాలు తెలియచెప్తామనీ, ప్రజా కోర్ట్ లో తేల్చుకుంటామని వారు అన్నారు.