తమ్మిలేరుకి ఇరువైపుల ప్రహరీ గోడ మరియు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఏలూరు జనసేన ధర్నా

ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 19 వ డివిజన్ లో హనుమాన్ నగర్ వంతెన నుండి పోణంగి వరకు తమ్మిలేరుకి ఇరువైపుల ప్రహరీ గోడ నిర్మాణం మరియు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మరియు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.సోమయ్య, పి.కిషోర్, వి.సాయిబాబు, జగన్నాధం, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, మండల ఉపాధ్యక్షుడు సుందరనీడి ప్రసాద్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, బెజవాడ నాగభూషణం, బోండా రాము నాయుడు, రాపర్తి సూర్యనారాయణ, ములికి శ్రీనివాస్, వెంకట్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.