ఏలూరు జనసేన పార్టీలోకి భారీ చేరికలు

ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 12,13వ డివిజన్ల నుండి రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ సానాసి రమణతో పాటు సుమారు 30 మంది ఎస్సీ నాయకులు ఆదివారం జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు నూతనంగా జాయిన్ అయిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అరాచకాలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు తట్టుకోలేక వైసీపీ నుండి కార్యకర్తలు జనసేనలోకి చేరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవాలని యువత ముందుకు వస్తున్నారని, చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మీకు ఏ విధమైన సమస్యలు వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని, చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి పార్టీల కూటమి అభ్యర్థి బడేటి చంటి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, మీడియా ఇంచార్జీ జనసేన రవి తదితరులు పాల్గొన్నారు.