హెచ్ ఎల్ సి కెనాల్ ఆధునీకరణ చేయరా..?: అంకె ఈశ్వరయ్య

  • అనంత రైతుల కన్నీళ్ల కష్టాలు తీరెనా!!
  • అనంత ప్రజల రైతుల త్రాగు సాగునీరు అందేనా!!
  • వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య!!

కళ్యాణ దుర్గం: అనంతపురం జిల్లా వెన్నుముక అయిన హెచ్ ఎల్ సి కెనాల్ 73 ఏళ్లుగా అనంతపురం జిల్లా ప్రజానీకానికి త్రాగు సాగునీరు అందిస్తున్నా ఆధునికరణ పేరుతో ప్రభుత్వాలు కార్యాచరణ ఊసే ఎత్తలేదని జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అందుకే ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం హెచ్ఎల్సీ కెనాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక సరిహద్దు ప్రాంతం వరకూ ఆధునికరణ పనులు పూర్తి చేయగా ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలోని 84 కిలోమీటర్ల కాలవకు ఆధునికరణ చేపట్టలేదు, కనీసం దాని ప్రస్తావన కూడా తీసుకురావడం లేదని అనంత ప్రజల రైతాంగం పట్ల ఉదాసీనత ప్రదర్శించడంపై మండిపడ్డారు. రెండు లక్షల ఏకరాలకు నీరు అందించే హెచ్ఎల్సీ కాలువ శిథిలావస్థకు చేరుకుందన్నారు. నవీకరణ పేరు చెప్పి ప్రభుత్వాలు రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. నీటి వనరులు ఉన్న హెచ్ ఎల్ సి కెనాల్ శిథిలావస్థకు చేరుకోవడం వలన నీటిని సరిగా ఉపయోగించలేని స్థితిలో హెచ్ఎల్సీ కెనాల్ ఉందన్నారు. ఎక్కడికి అక్కడ వంతెనలు శిథిలావస్థకు చేరాయి, రైతుల సాగుకు ఇబ్బంది కరంగా మారిందని ఇప్పటికైనా అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు స్పందించి, జగన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితిగతిన ఆధునీకరణ పనులు పూర్తి చేసే రకంగా కార్యచరణ రూపొందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో హెచ్ ఎల్ సి కెనాల్ ఆధునీకరణ విషయంలో జనసేన పార్టీ ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్ కుమార్, ముప్పూరి క్రిష్ణ, అనంతపురం నగర ఉపాధ్యక్షులు జెక్కిరెడ్డి ఆదినారాయణ, నగర కార్యదర్శి హరీష్ రాయల్, రాప్తాడు రూరల్ మండలం అధ్యక్షులు రామాంజి, పవనిజం రాజు, వెంకటేశు తదితరులు పాల్గొనడం జరిగింది.