ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్తన క్రికెట్ కెరీర్ లో అరుదైన ఘనత సాధించాడు. సౌథాంప్టన్ వేదికగా పాకిస్థాన్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన జేమ్స్ అండర్సన్. టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5/56 రూపంలో ఐదు వికెట్ల హాల్‌ని అందుకున్న అండర్సన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 2/45‌తో నిలిచాడు. కానీ.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆఖరికి డ్రాగా ముగిసింది.టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌ వార్న్ (708), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619) టాప్-3లో కొనసాగుతున్నారు. తాజాగా 600 వికెట్లతో జేమ్స్ అండర్సన్ నాలుగో స్థానంలో నిలవగా.. తొలి మూడు స్థానాల్లో ఉన్న బౌలర్లు స్పిన్నర్లు కావడం కొసమెరుపు.2003లో జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఐదు రోజుల ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జేమ్స్ అండర్సన్.. ఇప్పటి వరకూ 156 టెస్టు మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో 10 సార్లు 10 వికెట్ల హాల్‌ని అందుకున్న ఈ ఇంగ్లాండ్ పేసర్.. ఏకంగా 29 సార్లు ఐదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.