మాకవరపాలెంలో జనసేనలో చేరికలు

మాకవరపాలెం మండలం అప్పన్న దొరపాలెం నుంచి తమరాన సత్తిబాబు అధ్యక్షతన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్యచంద్ర సమక్షంలో 20 మంది యువకులు వైసిపి మరియు టిడిపి నుండి ఆదివారం మాకవరపాలెం మండల జనసేన పార్టీ ఆఫీసులో జాయిన్ కావడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని ఈ నెలలోనే ముందుగా మండల కమిటీలు పూర్తి చేస్తామని తదుపరి గ్రామకమిటీలు మరియు బూత్ కమిటీ పూర్తి చేయడం జరుగుతుందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం దిశగా పార్టీలో చేరికలతోపాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులు వద్దకు తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా పయనిస్తూ ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా క్రియాశీలక సభ్యులుగా చేర్చి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్నామని రానున్న రోజులలో నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరే విధంగా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూది చక్రవర్తి మాకవరపాలెం మండలం నాయకులు కర్రి సురేష్, జనసేన వీరమహిళలోకి నా జ్యోతి, మండల ముఖ్య నాయకులు సేనాపతి శేషు, గొలుగొండ నాయకుడు రేగుబల్ల శివ, ఎడ్ల నాయుడు, తమరాన నాయుడు, దొంగల ఆనంద్, తంగేటి గంగాధర్, సఖిరెడ్డి సత్తిబాబు మాస్టర్, నిమ్మి మంగరాజు, నానాజీ, కోడూరు సంతోష్, నాతవరం నాయకులు మాకి రెడ్డి వెంకట రమణ పాల్గొన్నారు.