సినిమా థియేటర్స్ పైన ప్రత్యేకించి ఇప్పుడే దృష్టి ఎందుకు సారిస్తున్నారు..? నర్సీపట్నం జనసేన

నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ రాజన్న వీర సూర్యచంద్ర మాట్లాడుతూ… కరోనా కష్టకాలంలో ఇప్పటికే చాలా వరకు థియేటర్లు మూతపడి ఉన్నాయి వీటికి తోడుగా థియేటర్ నడపలేక చాలా వరకు నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లీజుకు ఇచ్చి ఉన్న పరిస్థితి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏ సినిమా వచ్చినా వారం పది రోజులు మాత్రమే కేవలం యువత మాత్రమే థియేటర్లకు సినిమా చూడడానికి వెళుతున్న పరిస్థితి అందులోనూ థియేటర్ యజమానులు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో చాలావరకు థియేటర్లు అద్దెలకు ఇచ్చుకున్న పరిస్థితి ఉంది మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ఉన్న ఈ గడ్డు కాలంలో కరోనా ప్రారంభమైన తర్వాత దరిదాపుల్లో మూడు సంవత్సరాలు కావస్తున్నా నష్టాల బాటలో ప్రయాణిస్తున్న థియేటర్ యాజమాన్యాలు తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక అవస్థలు పడుతున్న పరిస్థితి ఇలాంటి సమయంలో విచారణల పేరుతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పటికే 259 థియేటర్లు మూసివేశారు థియేటర్లపై ఆధారపడి పార్కింగ్ లీజుకు తీసుకున్నవారు అందులో పనిచేసే కార్మికులు క్యాంటీన్ తీసుకున్నవారు అందులో పనిచేసే కార్మికులు గేట్మెన్ లు బుకింగ్ క్లర్కులు మరియు థియేటర్ మేనేజర్ ఎంత మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు?? వీరందరి జీవనాధారం సినిమా హాల్ థియేటర్ పై ఆధారపడి జీవించేవాళ్ళు ఏ విధంగా జీవిస్తారు…? ఇప్పటికే బడాబాబులు చేతుల్లో థియేటర్లు వెళ్ళిపోయాయి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా థియేటర్ల బాధ్యత చూసుకోలేని పరిస్థితి మరీ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ల పూర్తిగా మూతపడి ఉన్నాయి ఎక్కడైనా సీ క్లాస్ సెంటర్స్ మరియు బి క్లాస్ సెంటర్స్ మూతపడి ఉన్న థియేటర్లు చూస్తున్నాం కానీ ఐనాక్స్ ఇలాంటి థియేటర్లలో ఎందుకు తనిఖీలు నిర్వహించడంలేదు. సినిమా పరిశ్రమపై అంత శ్రద్ధ ఉంటే మీరు సినిమాను నిర్మించి ఇప్పుడు ఎలా అయితే ప్రభుత్వ మద్యం దుకాణం అమ్ముతున్నారో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్ ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకొని తక్కువ ధరకు వినోదం అందించండి అంతేకానీ ప్రైవేటు వ్యక్తులు నిర్వహించినటువంటి సినిమాలను ప్రభుత్వ నియంత్రణలో ధరలు తగ్గించి సామాన్యుడికి అందుబాటులో ఉంచుతున్నాం అని గొప్పలు చెప్పుకోవడం ఏంటి? నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు అంతేకాకుండా భవన నిర్మాణానికి సంబంధించి సిమెంటు ఇసుక ఇనుము అన్ని ధరలు పైకి ఉన్నాయి ఇలాంటి వాటిపై దృష్టి పెట్టండి ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ఎందుకు దాడులు చెయ్యరు…? ప్రత్యేకించి సినిమా హాల్లపై మాత్రమే ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారు విద్య వైద్యం వినోదం పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కానీ ప్రత్యేకించి సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊది కళ్యాణ్ చక్రవర్తి, నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, మాకవరపాలెం మండల నాయకులు, గొలుగొండ మండలం నాయకులు, నాతవరం మండలం నాయకులు పాల్గొన్నారు.