డా. పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నగిరి నియోజకవర్గం నుంచి జై భీమ్ సంస్థ వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ పి.రామచంద్రన్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పగడాల మురళి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, జిల్లా వీరమహిళా విభాగం కో ఆర్డినేటర్ శ్రీమతి ఆకుల వనజ, జిల్లా అధికార ప్రతినిధి మెరుపుల మహేష్, జిల్లా కార్యదర్శి దేవర మనోహర్, జిల్లా సంయుక్త కార్యదర్శి స్వామి నాథన్, సీనియర్ నాయకులు ముక్కు సత్యవంతుడు, గోపి రాయల్, మరియు నగిరి నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.