బూరుగుపూడిలో బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

  • వైసీపీకి ముకుమ్మడి రాజీనామాలు
  • బూరుగుపూడి గ్రామంలో జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు, కార్యకర్తలు..
  • జననీరాజనాలతో జనసంద్రమై ‘బత్తుల’ దంపతులకు అఖండ స్వాగతం పలికిన బూరుగుపూడి గ్రామ వాసులు
  • ‘బత్తుల’ దెబ్బకు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైసిపి అడ్రస్ గల్లంతు
  • జనసేన పార్టీ చేరికలు తగ్గేదేలే అంటూ.. ఫుల్ జోష్ లో జనశ్రేణులు
  • ఎన్నికలకు ముందే వైసీపీకి ‘చెక్’ పెట్టేలా “బత్తుల” పదునైన వ్యూహం

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో.. వైఎస్ఆర్సిపి కి చెందిన కీలక నేతలు, కార్యకర్తలు 100 మంది.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన చేస్తున్న ప్రజా పోరాటాలు మరియు రాజానగరం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన సేవానిరతిని చాటుకుంటూ.. ప్రజా సమస్యలపై దీటుగా స్పందిస్తూ.. నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల బాసటగా ఉంటూ.. ప్రజల ఆశీస్సులతో ప్రజానాయకుడిగా ఎదుగుతున్న బత్తుల బలరామకృష్ణ సమర్వంతమైన నాయకత్వానికి. నియోజవర్గ జనసేన పార్టీ రథసారథి బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు సీనియర్ జనసేన నేతలు, జనసైనికుల సమక్షంలో జనసేన కుటుంబంలోకి చేరారు. వారందరికీ బలరామన్న జనసేన కండువా వేస్తూ. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, జనసేన పార్టీ ఘన విజయం కోసం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జనసేన రథసారథి బలరామన్న దెబ్బ మీద దెబ్బకు పిచ్చుకలా అల్లాడుతున్న వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసే అవకాశం ఉండడంతో.. రాజానగరం నియోజకవర్గంలో జనశ్రేణులు ఎదురుచూస్తున్న పవనోత్సవానికి అంకురార్పణ మొదలైనట్టయింది.