బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

  • బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో చేరిన 60 మంది కూనవరం టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తలు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో ప్రస్తుత ప్రభుత్వ దాష్టీక పాలనకు విసుకు చెందిన అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలు, ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయలేని స్థితికి వచ్చేస్తున్న పార్టీలోని అసమర్థను తాళలేక కూనవరం టీడీపీ కార్యకర్తలు ఒక మార్పు, నవసమాజ స్థాపన కోసం రాజనగరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సమీకరణాలు మార్చిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సమక్షంలో కూనవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు గ్రామ పెద్దలు మట్ట వేంకటేశ్వరరావు, మాధవరాపు వీరభద్ర రావు, మదవరపు కోటేశ్వరరావు, అడపా నరసింహరావు, చౌటుపల్లి లాలిబాబు, సంగిశెట్టి స్వామి కాపు, మాధవరాపు నాని, గేదెల రాధాకృష్ణ వారి ఆధ్వర్యంలో బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జన‌సేన తీర్థం పుచ్చుకున్నారు. కూనవరం గ్రామంలోని టీడీపీ మరియు వైసీపీ ఎదుగుదలకు ఆది నుంచి సేవలందిస్తున్న నాయకులు, మరియు కార్యకర్తలు బండారు గుణ శేఖర్, దండుబోయినా కృష్ణ, పట్టపగలు రమేష్, నుజ్జెళ్ళ వీరేంద్ర, దండుబోయిన రవి కుమార్, నుజ్జెళ్ల రమేష్, బినబోయిన మణికంట, చిన్నారపు రామకృష్ణ, చిన్నవరపు లక్ష్మణ్, చిన్నవారపు దుర్గాప్రసాద్, చిన్నారాపు కామేశ్వరరావు, దండుబోయిన శివకృష్ణ, పట్టపగలు శ్రీను, దండుబోయిన రాధాకృష్ణ, నుజ్జెల్ల గంగరాజు, నుజెళ్ళ శ్రీను, పట్టపగలు కృష్ణ, పట్టపగలు నాగేశ్వరరావు, నుజెళ్ల సూర్యచంద్ర రావు, నుజెల్ల సూరి అబ్బులు, పట్టపగలు సత్యనారాయణ, పోలేటి సూరిబాబు, నుజేళ్ళ నాగ మురళి కృష్ణ, నుజేళ్ల మంగరాజు, నుజేల్ల తిరుపతిరావు, నుజెళ్ళ రామాంజనేయులు, నూజెళ్ళ చిన్న అబ్బులు,నుజెళ్ళా సతీష్, బండారు రామచంద్రరావు, బండారు గోపాలకృష్ణ, చింతపల్లి శ్రీను, చింతపల్లి దుర్గా ప్రసాద్, కందుల వెంకటగిరి మరియు గ్రామ పెద్దలు, యువత తదితరులు సుమారు “60 మంది” పెద్ద సంఖ్యలో బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడంతో సీతానగరం మండలంలో రాజాకీయ చర్చలకు దారి తీసీంది ఒక సామాజిక మార్పుకోసం వీళ్లంతా నడుము కట్టి జనసేనలోకి రావడం ప్రత్యర్థుల ఓటమికి పడే తొలి అడుగు అని జనసేన గెలుపుకి మరింత బలం చేకూరిందని అని బత్తుల అన్నారు. అన్ని గ్రామాల్లోనూ ఇలానే చాలామంది అసమానతులకు గురై అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అతి త్వరలో భారీ సంఖ్యలో రాజనగరం నియోజకవర్గంలో జనసేనలో చేరికలు ఉండబోతున్నాయి ప్రజలకు అండగా ఉండే పార్టీకి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని ఆశిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న కూనవరం జనసైనికులకు నాయకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సాగర స్వాగతాన్ని పలుకుతూ గ్రామంలో ఎటువంటి క‌ష్టం వచ్చినా… జనసేన పార్టీ అండగా ఉంటుందని మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో నేను, నా కుటుంబం ఉంటామని, అధికార పార్టీ బెదిరింపులకు గడ్డిపోచ కూడా వణకదు, ప్రజలు చైతన్యవంతులు, మీకు సరైన గుణపాఠాన్ని తెలియజేస్తారు. మా కార్యకర్తల జోలికి వచ్చేముందు నన్ను దాటుకుని వెళ్లాలని సభాముఖంగా బత్తుల బలరామకృష్ణ హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన శ్రేణులు, కూనవరం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.