బీసీల కోసం 56 కార్పొరేషన్ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా గిఫ్ట్ అందివ్వనున్నట్టు తెలిసింది. తాను అధికారంలోకి వస్తే ఒక్కో బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలో భాగంగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని బిసిల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలోని 139 వెనకబడిబన కులాల కోసం బీసీ సంక్షేమ శాఖ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్ ను ఏ కేటగిరిగా, 10 లక్షల వరకు జనాభా కలిగిన కార్పొరేషన్ ను బి కేటగిరిగా, లక్షలోపు జనాభా కలిగిన కార్పొరేషన్ ను సి కేటగిరిగా విభజించారు. ఈ నెల 18 వ తేదీన కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం జరగబోతున్నది.