అడల్ట్ ఫిలిం స్టార్‌గా ఎస్తర్ నోరోన్హా

సునీల్ నటించిన భీమవరం బుల్లోడు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఎస్తర్ నోరోన్హా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఎస్తర్ నొరోన్హా ఎవరో తెలుసు కదా.. ప్రముఖ సింగర్, బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ సీన్ మాజీ భార్యనే ఎస్తర్ నోరోన్హా. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఆ తర్వాత పరస్పర అభిప్రాయ బేధాలతో డైవర్స్ తీసుకున్నారు.

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే నోయెల్‌కి డైవర్స్ ఇచ్చినప్పుడు వార్తల్లోకెక్కిన ఎస్తర్ ఆ తర్వాత మళ్లీ ఈ రీ ఎంట్రీతో వార్తల్లో నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎస్తర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రొటీన్ సినిమాను కాకుండా ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌ను సెలెక్ట్ చేసుకుంది.

హీరోయిన్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఎస్తర్ ఓ పోర్న్ స్టార్‌గా నటించనుంది. తిరుపతి ఎస్ఆర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. హీరోయిన్ మూవీ స్క్రిప్ట్ ప్రకారం ఎస్తర్ చాలా బోల్డ్ గా కనిపించనుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.