జనసేనాని ఆశయాల కోసం యూరప్ జనసేన రూపాయలు 5,55,555/- విరాళం

  • యూరప్ జనసైనికులకు అభినందనలు

జనసేన పి.ఎ.సి. సభ్యులు కొణిదెల నాగబాబు యూరప్ ఖండంలో స్థిరపడిన జన సైనికులు సమష్టిగా ఏర్పడి ఇంటికి దూరంగా జనసేనాని ఆశయాలకు దగ్గరగా అనే నినాదంతో ‘నా సేన కోసం నా వంతు’, ‘రైతు భరోసా యాత్రా కోసం రూపాయలు 5,55,555/- జనసేనకు విరాళంగా అందజేయడం అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్న తెలుగు వారు మాతృ భూమిపై ప్రేమతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలబడుతున్న ప్రతీ ఒక్కరి నమ్మకాన్ని నిలబెడతామని వెల్లడించారు. విరాళం సమకూర్చిన వారిలో రవికృష్ణ యర్రంశెట్టి, ప్రతాప్ రేపల్లె, రాజు గరగ, జ్యోతి దల్వాయి, ఫణి కొండా, నరేష్ మేళం ముఖ్య పాత్ర పోషించడం జరిగింది.