వ్యాక్సిన్ తీసుకున్నా .. మంత్రికి కరోనా పాజిటివ్‌

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న హర్యానా వైద్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా నవంబర్‌ 20న విజ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అనంతరం రాష్ట్రం నుంచి వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గన్న మొదటి వాలంటీర్‌ను తానేనంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్‌ తేలిందని అనిల్‌ విజ్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మంత్రికి కరోనా రావడంతో కలకలం రేపింది. దీంతో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివ్రుద్ధి చేస్తోంది. కాగా ఆయన ప్రస్తతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.