ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది: గంగారపు రాందాస్

మదనపల్లి నియోజకవర్గం: అక్రమ కేసుల్లో ఇరికించిన ప్రతిపక్షాల కార్యకర్తలను, జనసేన సానుభూతిపరులను మదనపల్లి సబ్ జైలులో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో గురువారం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస పాలనలో, అరాచక పాలనలో, దుర్మార్గ పాలనలో ప్రతిపక్షాలు, విపక్షాలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ప్రభుత్వంపై ప్రశ్నించినా, మౌలిక సదుపాయాలపై ప్రశ్నించినా, సామాజిక న్యాయం గురించి ప్రశ్నించినా ఈ వైసీపీ ప్రభుత్వానికి జైలులో పెట్టడం ఆనవాయితీగా అయిపోయిందని అన్నారు. గత నెల రోజుల నుంచి జనసేన పార్టీ సానుభూతిపరులను జైల్లో పెట్టిన అయాజ్ ను మిత్రబృందాన్ని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం జరిగిందని అన్నారు. అలాగే చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయిన ప్రభాకర్ స్పాట్లో లేకపోయినా, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలని, మదనపల్లి కార్యకర్తలని వైసిపి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే గారి ఒత్తిడి వలన పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా పనిచేసి అక్రమ కేసులు పెట్టి సబ్ జైల్లో పెట్టారని దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఇప్పుడు ఎవరైతే శిక్షలు అనుభవిస్తారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు మనో ధైర్యం కోల్పోకుండా ఉండాలని ఎప్పటికైనా సత్యమేవ జయతే న్యాయం గెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటి విభాగ నాయకులు జగదీష్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, నవాజ్, రెడ్డమ్మ, జనార్ధన్ నారాయణస్వామి, చక్కం రమేష్, శేఖర తదితరులు పాల్గొన్నారు.