గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‎కు పోరుకు సర్వం సిద్ధం

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పోరుకు సర్వం సిద్దమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నేడు డివిజన్ల వారీగా రిజర్వేషన్లను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‎ను ఈ రోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరుసటి రోజు నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ఏర్పాట్లు ఎల్బీ, ఆర్ట్స్ కళాశాలల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు